పల్లెపాడులో ప్రబలిన విషజ్వరాలు
ఇందుకూరుపేట, సెప్టెంబర్ 27 ( ఆన్లైన్ ) : మండలంలోని పల్లెపాడు విషజ్వరాల బారిన పడింది. దాదాపు 250 మందికి పైగా బాధితులు గ్రామంలో ఉన్నారు. గురువారం నాటికి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 60 మంది చికిత్స తీసుకొంటుండగా, రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో 30 మంది చేరారు. మరి కొన్ని ఆసుపత్రుల్లో కూడా పల్లెపాడు బాధితులు చేరారు. విషజ్వరాలతో గ్రామస్థులు అల్లాడుతున్నా, ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
పారిశుధ్యలోపంతోనే..
గ్రామంలో పారిశుధ్యం లేక రోగాలు ప్రబలాయి. చెత్త, మురుగు గ్రామమంతా అలుముకొని ఉన్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకొన్న దాఖలు లేవు. గ్రామ కార్యదర్శి అసలు గ్రామానికి రావటంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలో గత శుక్రవారం మొదటిగా గ్రామంలో ఒక్కసారిగా 10 ఇళ్లలో జ్వరాలు వ్వాప్తి చెందాయి. మూడు నాలుగు రోజులకు కూడా తగ్గకపోవడంతో ఆందోళన చెందారు. గ్రామమంతా వ్యాప్తి చెందటంతో భయాలు నెలకొన్నాయి. దీనితో గ్రామస్థులు ప్రాణాలు చేతిలో పెట్టుకొని జిల్లా కేంద్రంలో పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఆర్థికంగా లేని వారు గ్రామంలోనే మందుల షాపులో బిల్లలు మింగుతున్నా వైద్య సిబ్బంది అసలు పట్టించుకోలేదు.