పల్లిపాడు గ్రామం లో మద్యపాన నిషేధనికి అభ్యర్ధన
తేది :_________
పల్లిపాడు గ్రామం
ఇందుకూరుపేట మండలం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
గౌరవనీయులైన _ _ _ _ _ _ _ _ _ _ _
విషయం : గాంధీ మహాత్ముడు నడిచిన పల్లిపాడు గ్రామం లో మద్యపాన నిషేధనికి అభ్యర్ధన
జాతిపిత గాంధీ జి గుజరాత్ లోని సభార్మతి ఆశ్రమం తర్వాత ఎంతో ఇష్టపడి స్వయంగా గాంధీ జి చే ప్రారంబించిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం(రుస్తుం జి భవనం) మా గ్రామం లో ఊండటం మాకు ఎంతో గర్వకారణం. గాంధీ రెండు పర్యాయములు పల్లిపాడు గ్రామం పర్యటించి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం లో స్వతంత్ర పోరాటానికి ఊధ్యమ రూపకల్పన చేసిన నేలఫై పుట్టినందుకు గాంధీ జి ఆశయాల వైపు నడవవలసిన భాధ్యత మా ఫై నడిపించవలసిన భాద్యత ప్రజలు,ప్రభుత్వం ,ప్రభుత్వ యంత్రాంగం ఫై ఊంది. కాని మా గ్రామం లో ప్రస్తుతం మద్యం యేరులై పారుతుంది. సుమారు 6 సంవత్సరాల క్రితం వరుకు పల్లిపాడు గ్రామం లో మరియు చుట్టుపక్కల 5 కి.మీ పరిధి లో మద్యపాన దుకాణాలు లేకపోవడం తో మా గ్రామం గాంధీ జి గ్రామా స్వరజ్యం ఆశయాలకు అనుగుణంగా మా గ్రామం ప్రజలు, మహిళలు సంతోసంగా జీవనం సాగించేవారు, ఆ తర్వాత మా గ్రామం లో ఏర్పడిన మద్యం దుకాణాలు మరియు వాటికీ అనుభంధం గా గ్రామం లో ప్రేతి 200 మీ. కి పుట్టుకొచ్చిన బెల్ట్ దుకాణాల వల్ల గ్రామంలో ప్రజల కుటుంబ ఆదాయం తగ్గడం, మహిళా హింస పెరగడం, పేకాట/జుధాలు,గొడవలు పెరిగిపోయాయి. కస్టపడి మా గ్రామం పూర్తిగా వ్యవసాయం ఫై ఆధారపడిన గ్రామం, ఇక్కడ మహిళా రైతు కూలీలే ఎక్కువగా ఊన్నారు, కస్టపడి సంపాదించినా ఆ కష్టం మా నోటికి అందే లోపే మద్యం దుకాణానికి చేరుతుంది, ఈ పరిస్థితుల వల్ల మా గ్రామా మహిళలు పలుమార్లు ఆ బెల్ట్ దుకాణాల ఫై దాడి చేసిన సందర్భాలు కోడా చోటు చసుకోవడం జరిగింది. మా వ్యధని అర్ధం చసుకొని గాంధీ జి ఆశయాలకి అనుగుణంగా చారిత్రిక నేపధ్యం గల మా గ్రామం లో మరియు గ్రామానికి 5 కి.మీ పరిధి లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాల్సిందిగా ప్రార్ధిస్థున్నమ్. మీ శక్తీ మేరకు మా గ్రామం లో మద్యపాన నిషేధనికి కృషి చేయగలరని ఆశిస్తున్నాం.
ఇట్లు
పల్లిపాడు గ్రామా యువత & మహిళలు
మరియు
గాంధీ ఆశయ సాధన సమితి
పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం విశిష్టత ను విద్యార్ధులకు పాటం గా చేర్చాలని అభ్యర్ధన
No comments:
Post a Comment